Share News

ముంచిన మొక్కజొన్న

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:59 PM

మండలంలో 2,800 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడి ఆశాజకనంగా వచ్చింది. ఇంకేముంది అంతా మంచే జరుగుతుందనుకున్న సమయంలో ధర అమాంతం పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ముంచిన మొక్కజొన్న
మొక్కజొన్నను ఆరబెడుతున్న రైతు


దిగుబడి ఉన్నా, ధర లేక రైతు నిరాశ

మొన్నటి వరకు క్వింటా రూ.2,500, నేడు

రూ.1,400 కూడా కష్టమే

కొలిమిగుండ్ల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో 2,800 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడి ఆశాజకనంగా వచ్చింది. ఇంకేముంది అంతా మంచే జరుగుతుందనుకున్న సమయంలో ధర అమాంతం పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

కనిపించని కొనుగోలు కేంద్రాలు

మొక్కజొన్నలను ప్రభుత్వం రూ.2400 మద్దతు ధరలతో కొనుగోలు చేస్తామని గతంలో ప్రకటించింది. అయితే అది నేటికీ అమలుకాలేదు. ప్రజాప్రతినిధులు స్పందించి, కనీస మద్దతు ధర రూ.3వేలు చెల్లించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఆశాజనకంగా దిగుబడి

తక్కువ పెట్టుబడి, వేగంగా పంట చేతికొచ్చే అవకాశం ఉండటంతో రైతులు మొక్కజొన్న సాగుచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ఎకరాకు 25 క్వింటాళ్లకు పైగానే దిగుబడి వచిన్నట్లు రైతులు తెలిపారు.

పడిపోయిన ధర

దిగుబడి వచ్చినా ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది క్వింటాలుకు రూ.2500, నుంచి రూ.3000 వరకు పలికిన ధర, ఈ ఏడాది మాత్రం భారీగా పతనమైంది. రోజు రోజుకూ పడిపోతూ క్వింటాలకు రూ.1400కు చేరడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఎంత నాణ్యమైన దిగుబడి ఉన్నా, రూ.1,500 మించి ధర రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.

ఎగుమతులు తగ్గడంతో పడిపోయిన ధర

మొక్కజొన్న ధరలు పడిపోయిన విషయం వాస్తవమే. ప్రస్తుతం ఎగుమతులు తగ్గిపోవడంతోనే ధర పడిపోయినట్లు మార్కెట్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొక్కజొన్న కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి, ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సమాచారంలేదు. - సుధాకర్‌, ఏడీఏ

Updated Date - Mar 22 , 2026 | 11:59 PM