Share News

మొక్కజొన్న పరిశీలన

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:41 AM

మండలంలోని దైవందిన్నె గ్రామ పరిధిలో తెలంగాణకు చెందిన సీడ్‌ ఆర్గ్గనైజర్‌ ఇచ్చిన మొక్కజొన్న విత్తనాలను సాగుచేసి రైతులు నష్టపోయిన పంటను ఎమ్మిగనూరు వ్యవసాయ అధికారులు పరిశీలించారు.

మొక్కజొన్న పరిశీలన
దైవందిన్నెలో మొక్కజొన్నను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని దైవందిన్నె గ్రామ పరిధిలో తెలంగాణకు చెందిన సీడ్‌ ఆర్గ్గనైజర్‌ ఇచ్చిన మొక్కజొన్న విత్తనాలను సాగుచేసి రైతులు నష్టపోయిన పంటను ఎమ్మిగనూరు వ్యవసాయ అధికారులు పరిశీలించారు. దైవందిన్నెకు చెందిన రామలింగుడు, మల్లికార్జున, హనుమే్‌షతో పాటు మరికొంత మంది రైతులు తెలంగాణలోని అయిజ మండలానికి చెందిన మొక్కజొన్న సీడ్‌ ఆర్గ్గనైజర్‌ ఇచ్చిన విత్తనాలను 24 ఎకరాల్లో సాగుచేశారు. ఇందుకు గాను ఎకరాకు రూ లక్షకు పైగా వెచ్చించారు. తీరా పంట కోతకొచ్చిన సమయంలో గింజలు లేని కంకులు ఉండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్ధితి ఏర్పడింది.

ఈ విషయంపై సీడ్‌ ఆర్గనైజర్‌ దృష్టికి తీసుకెళ్లిన్పటికీ స్పందించలేదు. రైతులు నష్టపోయిన విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో ఏడీఏ మహ్మద్‌ ఖాధ్రీ, ఏవో శివశంకర్‌లతో పాటు వ్యవసాయ సిబ్బంది రైతులు సాగుచేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. పంట ఏపుగా పెరిగినప్పటికి కంకుల్లో గింజలు అంతంత మాత్రంగానే ఉండటం కొన్ని కంకులు పూర్తి ఖాళీగా ఉండటం గుర్తించారు. ఈ విషయంపై నివేదిక తయారు చేసి జేడీకి పంపనునట్ల వారు తెలిపారు.

Updated Date - Apr 07 , 2026 | 12:41 AM