Share News

రంగు మారిన నీరు

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:15 AM

మండల కేంద్రంలో కొన్ని రోజులుగా తాగునీటి కొళాయిలకు రంగుమారి పాచి పట్టిన నీరు సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్థులు ఆ నీటిని తాగేందుకు ఇబ్బంది పడుతున్నారు.

రంగు మారిన నీరు

తాగేందుకు ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు

నాలుగురోజులకు ఒక్కసారి విడుదల

తాగునీటి కొళాయిలకు పాచినీరు

గోనెగండ్ల, జూలై 5(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కొన్ని రోజులుగా తాగునీటి కొళాయిలకు రంగుమారి పాచి పట్టిన నీరు సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్థులు ఆ నీటిని తాగేందుకు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో 25వేల జనాభా ఉంది. గ్రామానికి చెందిన ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నుంచే తాగునీరు కొళాయిలకు సరఫరా అవుతుంది. అయితే నీటిని శుభ్రపరచడంలో సిబ్బంది అశ్రద్ధ కారణంగా కొళాయిలకు పచ్చటి రంగుతో కూడిన పాచినీరు వస్తున్నదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ ఉన్నప్పటికీ నాలుగు రోజులకు ఒకసారి 45 నిముషాల పాటు మాత్రమే నీరు విడుదల అవుతోంది. ఎంత మంది ప్రజాప్రతి నిధులు మారినప్పటికీ తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు. రాజకీయ నాయకులు ఓట్లు కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి తర్వాత పత్తా లేకుండా పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జలజీవన్‌ మిషన్‌ పనులు ఇప్పట్లో తేలే విషయంగా కనిపించడం లేదు. పాచిపట్టిన నీటిని తాగితే రోగాల బారినపడే ప్రమాదం ఉందని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:15 AM