సమన్వయంతో రిపబ్లిక్ డే వేడుకలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:38 PM
అన్ని శాఖల సమన్వయంతో రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ స్పష్టం చేశారు.
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల క్రైం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): అన్ని శాఖల సమన్వయంతో రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ స్పష్టం చేశారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ శనివారం పరిశీలించారు. రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ (పేరెడ్ కమాండర్) ఆధ్వర్యంలో కవాతు రిహార్సల్స్ నిర్వహిస్తూ ఎస్పీకి గౌరవ వందనం సమర్పించి కవాతు పరిశీలనకు ఆహ్వానించారు. అనంతరం ద్వితీయ పెరేడ్ కమాండర్ మార్చింగ్ నిర్వహించారు. సోమవారం నిర్వహించే గణతంత్ర వేడుకల్లో కవాతును మరింత అద్భుతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. పోలీసు జాగిలాలు ‘హనీ’, ‘మార్షల్’ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు బాబు, మంజునాథ్, సురేష్‌బాబు, ఆర్‌ఎస్‌ఐలు ఉమా మహేశ్వరరెడ్డి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.