Share News

బీఎల్‌ఏల సహకారం కీలకం

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:18 AM

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌) ప్రక్రియ మరో పది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల బూత లెవెల్‌ ఏజెంట్లు(బీఎల్‌ఏ) కీలక పాత్ర పోషించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు.

బీఎల్‌ఏల సహకారం కీలకం
మాట్లాడుతున్న ఈఆర్వో, కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు ఈఆర్వో, కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూలై4(ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌) ప్రక్రియ మరో పది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల బూత లెవెల్‌ ఏజెంట్లు(బీఎల్‌ఏ) కీలక పాత్ర పోషించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు. శనివారం నగర పాలక కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 14తో సర్‌ ఎన్యూమరేషన ప్రక్రియ ముగియనున్నందున చివర వరకు వేచి ఉండకుండా పెండింగ్‌లో ఉన్న ఫారాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ‘సర్‌’పై ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఎల్‌వోలతో పాటు బీఎల్‌ఏలు సైతం ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన ప్రక్రియలో సహకరించాలని కోరారు. కార్యక్ర మంలో ఏఈఆర్‌ఓలు, అదనపు కమిషనర్‌ ఆర్‌జీవి.కృష్ణ, తహసీల్దారు రవికుమార్‌, డీటీ ధనుంజయ పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:18 AM