‘సర్’కు సహకరించండి
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:39 PM
దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)ను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్‌వోలు) ప్రజలు సమష్టిగా సహకరించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు.
ఆర్వో, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు కల్చరల్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)ను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్‌వోలు) ప్రజలు సమష్టిగా సహకరించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. శుక్రవారం బాలాజీనగర్‌లోని కర్నూలు కన్వెన్షన్ హలులో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన బీఎల్‌వోలకు ‘సర్’పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐఆర్ లక్ష్యాలు, విధివిధానాలు, బీఎల్‌ఓల పాత్ర, ప్రజల బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆర్‌వో మాట్లాడుతూ ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా, తప్పులేలేనిదిగా రూపొందించడమే ఎస్‌ఐఆర్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ నెల 15 నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి వెళ్లి సర్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఓటరు జాబితా తయారీలో రాజకీయ పార్టీలు, బీఎల్‌ఓలు, ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎన్నికల సంఘానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దారు రవికుమార్, డీటీ ధనుంజయ, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.