పట్టణాభివృద్ధికి సహకరించాలి
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:48 PM
నంద్యాల పట్టణాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పిలుపునిచ్చారు.
న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల టౌన్, ఆగష్టు 22(ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పిలుపునిచ్చారు. శనివారం నూనెపల్లె మున్సిపల్ పాఠశాలలో ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ను నిర్వహించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ పరిసరాల శుభ్రత, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశయాలకు అను గుణంగా పట్టణాలు, పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఇటువంటి వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మెప్మా పీడీ వెంకటదాస్, మార్కెట్ యార్డు ఛైర్మన్ గుంటుపల్లి హరిబాబు, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.