గ్రామాభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:35 AM
ప్రజలతో భాగస్వాములై గ్రామాలభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లు ఎంపీపీగా మల్దిరెడ్డి పుష్పలత
వైస్ ఎంపీపీగా రషీదాబీ
ఓర్వకల్లు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రజలతో భాగస్వాములై గ్రామాలభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం స్థానిక మండల ప్రజాపరిషత కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీల ప్రమాణ స్వీకారోత్సవం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సతీష్ కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారి నాగఅనసూయ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 17 మంది ఎంపీటీసీ సభ్యులకు గానూ 16 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. ఎంపీపీగా ఉయ్యాల వాడ గ్రామానికి చెందిన ఎం.మల్దిరెడ్డి పుష్పలత, వైస్ ఎంపీపీగా హుశేనాపురం గ్రామానికి చెందిన రషీదాబీతోపాటు ఎంపీటీసీ సభ్యు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో ఎంపీటీసీలు దుగ్గ పాటి లక్ష్మి, మల్లెల జ్యోతి, రషీదాబి, షేక్ ఆలీబాషా, మద్దిలేటి నాయ క్, దబ్బుల పెద్ద గిడ్డయ్య, కానుగల బుగ్గన, లక్ష్మీదేవి, తెలుగు లక్ష్మీ, లక్ష్మీదేవి, కల్లెం పద్మావతి, బండారు హనుమన్న, రమణమ్మ, భారతి, పుష్పలత, మౌనికలు ఎంపీటీసీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలు గుర్తించి ఆదరించారన్నారు. కార్యక్ర మంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరెడ్డి, జిల్లా ట్రెజరర్ మహ బూబ్ బాషా, మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సింగిల్విండో చైర్మన్లు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, వివిధ గ్రామాల చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.