Share News

ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:55 PM

మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని రైతు, కార్మిక, విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి
ధర్నా చేస్తున్న నాయకులు

కర్నూలు న్యూసిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని రైతు, కార్మిక, విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కిసాన్‌ సంయుక్త మోర్చా జాతీయ సమితి పిలుపు మేరకు ఏఐకేఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు డి. శ్రీనివానసావు, సీఐటీయూ నగర కార్యదర్శి పి. నరసింహులు అధ్యక్షతన కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే నూతన విత్తన బిల్లును, విద్యుత్‌ సవరణ బిల్లులను తక్షనమే రద్దు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతులను నొక్కేసే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేవారిపై పీడీ యాక్ట్‌, రౌడీషీట్‌, అక్రమ కేసులను నమోదు చేయడం దారుణమన్నారు. వెంటనే కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఽపంపన్నగౌడు, ఎస్‌.మునెప్ప, బి.వెంకటేష్‌, నగేష్‌, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:55 PM