ఉపాధి హామీని కొనసాగించాలి
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:45 PM
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామి పథకాన్ని కొనసాగించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
కోడుమూరు రూరల్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామి పథకాన్ని కొనసాగించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన జీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ కోడుమూరు, వర్కూరులో బిల్లు ప్రతులను భోగిమంట్లో దహనం చేశారు. నాయకులు రాజు, గఫూర్‌మియా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యం పాలిస్తూ కార్మికులు స్వేచ్చగా పనిచేసుకునే అవకాశం లేకుండా లేబర్ కోడ్‌లను తగ్గించారని తెలిపారు. నల్లధనం తెచ్చి పేదల ఖాతాలకు జమచేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి, పనికి తగ్గ వేతనం అందకుండా చూస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి పథకం కొనసాగిస్తూ, నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని లేనిపక్షంలో పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. వీరన్న, కుమరస్వామి, బుడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.
ఫసీపీఐ శత వార్షికోత్సవ ముగింపు సభను జయప్రదం చేయాలని పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు.జిల్లా సహాయ కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు మాట్లాడుతూ 8న ఖమ్మంలో జరిగే సీపీఐ శత వార్షికోత్సవ ముగింపు సభను జయప్రదం చేయాలని కోరారు.