Share News

రూ.15కోట్లతో వసతి గృహాల నిర్మాణం

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:21 PM

మహానంది క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ.15 కోట్ల వ్యయంతో 50 వసతిగృహాలను నిర్మించనున్నట్లు టీటీడీ జేఈవో డాక్టర్‌ శరత్‌ తెలిపారు.

రూ.15కోట్లతో వసతి గృహాల నిర్మాణం
టీటీడీ జేఈవో డాక్టర్‌ శరత్‌కు జ్ఞాపికను అందజేస్తున్న ఈవో, చైర్మన్‌

టీటీడీ జేఈవో శరత్‌

మహానంది, అక్టోబరు 1 (ఆంరఽధజ్యోతి): మహానంది క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ.15 కోట్ల వ్యయంతో 50 వసతిగృహాలను నిర్మించనున్నట్లు టీటీడీ జేఈవో డాక్టర్‌ శరత్‌ తెలిపారు. ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి క్షేత్రంలో భక్తుల వసతి గదుల నిర్మాణంకోసం నిధులు కేటాయించాలని టీటీడీకి ఆయన ప్రతిపాదనలు పంపారు. గురువారం రాత్రి డాక్టర్‌ భరత్‌ మహానందికి వచ్చారు. క్షేత్ర పరిసరాల్లో గదులు నిర్మించేందుకు కావాల్సిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. 50 గదులతో మూడు అంతస్ధుల భవనంను మహానందిలో నిర్మించాలనే ఉద్దేశంలో భా గంగా అనువుగా ఉండే స్థలం సేకరించామన్నారు. త్వరలోనే నిర్మాణంకు అవసరమైన ప్లాన్‌ ఆమోదింప చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. జేఈవో దంపతులు క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవోతో పాటు చైర్మన్‌ నరాల చంద్రమౌళీశ్వర రెడ్డి స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ఏఈ లక్ష్మీపతి, దేవదా యశాఖ డీఈఈ మెల్లంపూరి శ్రీనివాసప్రసాద్‌, ఏఈలు శ్రీనివాసులు, రవికుమార్‌రెడ్డి, ఏఈవో మధు ఉన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:21 PM