Share News

రూ.6.50 కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:33 PM

జిల్లాలో రూ.6.50 కోట్లతో 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు సూపరింటెండెంట్‌ ఇంజనీరు(ఎస్‌ఈ) సుధాకర్‌కుమార్‌ అన్నారు.

రూ.6.50 కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు
మాట్లాడుతున్న విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సుధాకర్‌కుమార్‌

ఎస్‌ఈ సుధాకర్‌కుమార్‌

రుద్రవరం, జనవరి 3 (ఆంరఽఆదజ్యోతి) : జిల్లాలో రూ.6.50 కోట్లతో 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు సూపరింటెండెంట్‌ ఇంజనీరు(ఎస్‌ఈ) సుధాకర్‌కుమార్‌ అన్నారు. శనివారం తిప్పా రెడ్డిపల్లెలో ఆయన మాట్లాడుతూ రుద్రవరం, ఆళ్లగడ్డలో ఒక్కొక్కటి, నందికొట్కూరు నియోజక వర్గంలోని కల్లూరులో మరో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటికి రూ.6.50 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. రుద్రవరం మండలంలోని తిప్పారెడ్డిపల్లెలో ఏప్రిల్‌ మాసానికి సబ్‌స్టేషను పనులు పూర్తి చేయించి ప్రారంభిస్తామని ఆయన అన్నారు. జిల్లాలో అత్యధికంగా సబ్‌స్టేషన్లు ఉన్న మండలం రుద్రవరం మండలమేనని ఆయన అన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:33 PM