Share News

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద నిరంతర నిఘా : కలెక్టర్‌

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:26 AM

స్ర్టాంగ్‌ రూమ్‌ల వద్ద నిరంతర భద్రత పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద నిరంతర నిఘా : కలెక్టర్‌
స్ర్టాంగ్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

కర్నూలు న్యూసిటీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): స్ర్టాంగ్‌ రూమ్‌ల వద్ద నిరంతర భద్రత పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం నగర శివారులోని అథేనా పాఠశాలలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ర్టాంగ్‌ రూమ్‌లను, రిసెప్షన్‌ సెంటర్లను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ముందుగా బ్యాలెట్‌ బాక్సులను నిబంధనల ప్రకారం భద్రపరిచే ప్రక్రియను పరిశీలించారు. స్ర్టాంగ్‌ రూమ్‌ల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. బ్యాలెట్‌ బాక్సుల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిసెప్షన్‌ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది నుంచి ఎన్నికల సామగ్రి స్వీకరణ, బ్యాలెట్‌ బాక్సుల అప్పగింత ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 12:26 AM