Share News

పుట్టుకతో వచ్చే పాదాల వైకల్యాన్ని గుర్తించాలి

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:14 AM

పుట్టుకతో శిశువుల్లో వచ్చే పాదాల వైకల్యాన్ని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోవాలని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం వరల్డ్‌ క్లబ్‌ ఫుట్‌ డే సందర్బంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి డైస్‌ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

పుట్టుకతో వచ్చే పాదాల వైకల్యాన్ని గుర్తించాలి
మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

కర్నూలు జీజీహెచ్‌లో క్లబ్‌ ఫుట్‌ డే వేడుకలు

కర్నూలు హాస్పిటల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): పుట్టుకతో శిశువుల్లో వచ్చే పాదాల వైకల్యాన్ని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోవాలని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం వరల్డ్‌ క్లబ్‌ ఫుట్‌ డే సందర్బంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి డైస్‌ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ.. జూన్‌ 3వ తేదీన క్లబ్‌ ఫూట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరల్డ్‌ క్లబ్‌ ఫుట్‌ డేను డా.ఫోన్సెటి జయంతి సందర్బంగా నిర్వహిస్తారని చెప్పారు. పుట్టుకతో శిశువు పాదం కాని, పాదాలు కాని లోపలికి, కిందికి తిరిగిపోయి ఉండే పరిస్థితికి ఎటువంటి ఆపరేషన్‌ లేకుండా చిన్న వయసులోనే ఫోన్సెటీ విధానంతో నయం చేయవచ్చని చెప్పారు. ఆర్థోపెడిక్‌ హెచ్‌వోడీ డా కె.శ్రీనివాసులు మాట్లాడుతూ క్యూర్‌ ఇండియా సహకారంతో క్లబ్‌ ఫుట్‌ సమస్య ఉన్న చిన్నారులకు చికిత్స పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డైస్‌ సెంటర్‌ పీడీయాట్రిషన్‌ డా.సృజన, క్యూర్‌ ఇండియా ప్రతినిధి రేష్మా, వైద్యులు, పీజీలు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 12:14 AM