సర్వేను పకడ్బందీగా నిర్వహించండి
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:32 AM
గృహగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక అదనపు కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి అన్నారు.
నగరపాలక అదనపు కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): గృహగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక అదనపు కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి అన్నారు. దేశ జనాభా గణన-2027 కార్యక్రమంలో భాగంగా నగరంలో నిర్వహించనున్న గృహ గణన ప్రక్రియపై ఎన్యూ మరేట్లు, సూపర్‌వైజర్లు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బందికి నగరంలోని ఇందిరాగాంధీ మోమోరియం మున్సిపల్ స్కూల్, దామోదరం సంజీ వయ్య మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్‌ల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ గణనలో ప్రతి వివరాన్ని నిశితంగా నమోదు చేయాలన్నారు. నగరం లో మొత్తం 490 మంది ఎన్యూమరేట్లు, 79 మంది సూపర్‌వైజర్లు, 28 మంది ఫీల్డ్ ట్రైనర్లకు ఇద్దరు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ అందిస్తున్నారని వివరించారు. ఈనెల 15 నుంచి 17 వరకు మొదటి బ్యాచ, 21 నుంచి 23 వరకు రెండో బ్యాచకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెన్సస్ ఇనచార్జి ఎస్ ఇశ్రాయోల్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, హెడ్‌మాస్టర్ రెడ్డిపోగు విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.