ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:24 PM
ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ పోలీసులను ఆదేశించారు.
ఎస్పీ సునీల్ షెరాన్
కోవెలకుంట్ల/నంద్యాల నూనెపల్లి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి) : ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ పోలీసులను ఆదేశించారు. శనివారం నంద్యాల జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ సునీల్ షెరాన్ పలు నామినేషన్ కేంద్రాలను, సమస్యాత్మక గ్రామాలను సందర్శించారు. అందులో భాగంగానే కంపమల్ల గ్రామంలోని పోలీస్ పికెటింగ్‌ను సందర్శించారు. ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్న పరిస్థితులు శాంతి భద్రతలకు పరిరక్షణకు చేపట్టిన భద్రత చర్యలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల నిర్వహణ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు, అల్లర్లకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.