Share News

పారదర్శకంగా కౌంటింగ్‌ను నిర్వహించండి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:50 PM

జిల్లాలో నేడు జరిగే జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

పారదర్శకంగా కౌంటింగ్‌ను నిర్వహించండి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నేడు జరిగే జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె క్యాంప్‌ కార్యాలయం నుంచి జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కౌంటింగ్‌ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలను తప్పకుండా పాటించాలని స్వష్టం చేశారు. కౌంటింగ్‌ సిబ్బంది, ఎన్నికల అధికారులు, అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నిరంతరం కొనసాగించాలన్నారు. రౌండ్ల వారిగా ఓట్ల లెక్కింపు, ఫలితాల నమోదు, ధృవీకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:50 PM