ప్రాక్టికల్స్‌ను కట్టుదిట్టంగా నిర్వహించండి: కలెక్టర్
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:29 PM
జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణకు సంబంధించిన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాక్టికల్ పరీక్షలకు కావాల్సిన ఉపకరణాలు, కెమికల్స్ అన్నీ ఉండాలని, పరీక్షల నిర్వహణ గదులు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశానికి ఆర్‌ఐవో లాలెప్ప, అసిస్టెంట్ కమిషనర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గోవింద నాయక్, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.