ఎక్స్‌రే ఫిల్మ్ కోసం అవస్థలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:27 PM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎక్స్‌రే ఫిల్మ్ కోసం రోగులు ఆగచాట్లు పడుతున్నారు.
కర్నూలు హాస్పిటల్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎక్స్‌రే ఫిల్మ్ కోసం రోగులు ఆగచాట్లు పడుతున్నారు. సోమవారం న్యూ డయోగ్నస్టిక్ బ్లాక్‌లో ఎక్స్‌రే ఫిల్మ్‌లు ఇచ్చే గదిలో హాస్పిటల్‌కు చెందిన సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ఫిల్మ్‌లను ఇస్తున్నారు. ఉదయం 10.30 గంటల వరకు కేవలం ఒకే స్టూడెంట్ ఫిల్మ్ రిపోర్టులు ఇస్తుండటంతో రోగులు క్యూలో నిలబడలేక అవస్థలు పడుతున్నారు. న్యూ డయోగ్నస్టిక్ బ్లాక్‌లోని ఎక్స్‌రే ఇచ్చే రూం అత్యంత కీలకమైంది. రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ సిబ్బంది లేకపోవడంతో ఎక్స్‌రే ఫిల్మ్‌లు తీసుకోవడం ఆలస్యమవుతుతోంది. ఉదయం 10 గంటలైనా ఎక్స్‌రై ఫిల్మ్‌లు ఇచ్చే గది నెంబరు 20లో సిబ్బంది లేకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.