ట్యాంకులను నింపేందుకు సమగ్ర ప్రణాళిక
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:26 PM
కాస్కేడ్ విధానం ద్వారా ట్యాంకులను సమర్థవంతంగా నింపేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులనను ఆదేశిం చారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): కాస్కేడ్ విధానం ద్వారా ట్యాంకులను సమర్థవంతంగా నింపేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులనను ఆదేశిం చారు. గురువారం ఆమె తన ఛాంబర్‌లో జలధార కార్యక్ర మంపై భూగర్భ జలశాఖ, జలవనరుల శాఖ, డ్వామా ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఏపీఎస్‌ఆర్‌ఏసీ) నోడల్ అధి కారి లక్ష్మీకాంత్‌రెడ్డి జలఽ దార కార్యక్రమానికి సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు. జిల్లాలో గుర్తించిన 23 కాస్కేడ్ వ్యవస్థల ద్వారా 86 ట్యాంకులను నింపేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయా లని సూచించారు. జిల్లాలోని 11మండల్లాలో నీటి ఎద్దడి ఉన్న ప్రాం తాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లా భూగర్భ జలశాఖ అధికారి రఘురాం, జలవనరుల శాఖ అధికారి శివశంకర్,డ్వామా పీడీ సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.