కూటమితోనే పల్లెల సమగ్రాభివృద్ధి
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:09 PM
కూటమి ప్రభుత్వంతోనే పల్లెల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
వైసీపీకి ఓట్లు అడిగే హక్కు లేదు
ర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే పల్లెల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయం ఏకపక్షమే అన్నారు. అరాచక పాలన సాగించిన వైసీపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు గుర్తు చేశారు. ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లను లొంగకుండా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా తిప్పికొట్టాలని కోరారు.