గడువులోపు పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:31 AM
పట్టణంలో చేస్తున్న అభివృద్ధి పనులను గడువులోపు పూర్తిచేయాలని అఽధికారులను ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం పట్టణంలో పర్యటంచి, పనులను స్వయంగా పరిశీలించారు
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, బనగానపల్లెలో అభివృద్ధి పనుల పరిశీలన
బనగానపల్లె, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో చేస్తున్న అభివృద్ధి పనులను గడువులోపు పూర్తిచేయాలని అఽధికారులను ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం పట్టణంలో పర్యటంచి, పనులను స్వయంగా పరిశీలించారు. కరీంబాగ్, పంచమపేట, బీసీ కాలనీ, బస్టాండ్ ఏరియా, ఈద్గానగర్‌లో రోడ్లు, అండర్‌డ్రైనేజీ అభివృద్ది పనులను పరిశీలించారు. పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో డార్మిటరీ, సైన్సు ల్యాబ్ భవనాలను పరిశీలించారు. హాస్టల్‌ను సందర్శించి బాలికలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్ డీఈ నాగశ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సాయికృష్ణ, టీడీపీ నాయకులు షబ్బీర్, చికెన్‌షాపు వలి, గౌండా బాబు పాల్గొన్నారు.