గడువులోగా పనులు పూర్తిచేయండి
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:05 AM
గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ‘జలజీవన్’ కింద చేపట్టిన తాగునీటి పథకాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి/ నంద్యాల హాస్పిటల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ‘జలజీవన్’ కింద చేపట్టిన తాగునీటి పథకాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ తాగునీటి పథకాల పురోగతిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గాయత్రిదేవి, చీఫ్ ఇం జనీర్ హరిరామ్‌నాయక్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పనుల అమలులో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సున్నిపెంట తాగునీటి పథకం, డోన్ ప్రాజెక్టుల నిర్వహణకు, మరమ్మ తులకు అవసరమైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిధులు మంజూ రు చేయాలని కోరారు. గాయత్రి దేవి మాట్లాడుతూ కొత్తగా మంజూరైన రూ.510కోట్ల విలువైన పనులు రెండేళ్లలో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రూ.510 కోట్ల వ్యయంతో 161 ఆవాసాలకు తాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన ఓర్వకల్లు రిజర్వాయర్ ఆధారిత బహుళ గ్రామ తాగునీటి పథకం ఇంటెక్ వెల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో కర్నూలు సూపరింటెండెంట్ ఇంజనీర్ మనోహర్, నంద్యాల జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.