రీసర్వేను పారదర్శకంగా పూర్తి చేయండి
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:50 PM
జిల్లాలో చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా పూర్తిచేయాలని కలెక్టర్ డా.ఏ. సిరి అన్నా రు.
కలెక్టర్ డా. ఏ. సిరి
ఓర్వకల్లు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా పూర్తిచేయాలని కలెక్టర్ డా.ఏ. సిరి అన్నా రు. మంగళవారం మండలంలోని నన్నూరు గ్రామంలో జరుగుతున్న 5వ దశ రీసర్వే ప్రక్రియను జేసీ నూరుల్ ఖమర్‌తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి రైతుకు ముందస్తు నోటీసులు తప్పనిసరిగా అందజేయాలన్నారు. రీసర్వే ప్రక్రియలో పొలం సరిహద్దుల నిర్ధారణ, భూమి రికార్డుల సమీక్ష, రోవర్ సాంకేతిక విధానాల వినియోగం వంటి అంశాలను జాగ్రత్తగా అమలు చేయాలన్నారు. ఎలాం టి పొరపాట్లు లేకుండా సమయపాలన పాటిస్తూ రీసర్వే పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రీసర్వేలో భాగంగా రైతులకు ముందస్తు సమాచారం అందించడం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి రైతుకు వ్యక్తిగతంగా నోటీసులు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టంచేశారు. రీసర్వే ప్రక్రియను సమర్ధవంతంగా పూర్తి చేయడం ద్వారా భూసంబంధిత వివాదాలు తగ్గిపోవడంతో పాటు రైతుల హక్కులు మరింత బలపడుతాయన్నారు. ఆర్డీవో సందీప్ కుమార్, జిల్లా సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే సుబ్బారెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్, సర్వేయర్ శంకర్ మాణిక్యం, మండల సచివాలయ సర్వేయర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.