దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయండి
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:17 AM
: పింఛన్ల దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిరి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు
కలెక్టర్ సిరి
గూడూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): పింఛన్ల దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిరి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం గూడూరు మండలంలో ఆమె సుడిగాలి పర్యటన చేశారు. 22 ఏ, సర్ ప్రక్రియ, పింఛన్ల దరఖాస్తుల పరిశీలన. ఆక్షరాంధ్ర, స్వచ్ఛత హీ సేవ అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 22 ఏకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా పెం డింగ్ ఉండకూడ దన్నారు. పీజీఆర్‌ఎస్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరి ష్కరించా లన్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి ఎమ్మిగనూరు, పాణ్యం, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఎక్కువ పెండింగ్ ఉందని త్వరగా పూర్తి చేయాలని ఈఆర్‌ఓలను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అలాగే సాధారణ ప్రసవాలను పెంచాలని మాతా, శిశు మరణాల రేటు తగ్గించాలని ఆమె అధికారులను ఆదేశించారు. గూడూరులోని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అలాగే కొత్త బస్టాండ్‌ను పరిశీలించారు. పాత బస్టాండ్‌లో కమ్యూ నిటీ టాయిలెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి మంగళవారం నాటికి పంపాలని కలెక్టర్ కమిషనర్, ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం, తహసీల్దార్‌లను ఆదే శించారు. అనంతరం మండలంలోని పెంచికలపాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, తాగు నీరుపై ఆరా తీశారు. అనంతరం పెంచికలపాడు లో రైతు పురుషోత్తం ఆచార్య తన 3 ఎకరాల పొలంలో పీఎండీఎస్ విధానంలో మునగ, అంతర పంటలు గోరు చిక్కుడు, బంతి పూలు సాగును కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. అలాగే గూడూరు నగర పంచా యతీ పరిధిలో గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. సకాలంగా బిల్లు లు మంజూరు అవుతాయని లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు.