Share News

గడువులోగా గృహగణన పూర్తి చేయండి

ABN , Publish Date - May 21 , 2026 | 10:51 PM

నగరంలో కొనసాగుతున్న గృహ గణన(సెన్సస్‌) సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర సెన్సస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ దిబాకర్‌ బరిహా అధికారులను ఆదేశించారు.

గడువులోగా గృహగణన పూర్తి చేయండి
పరిశీలిస్తున్న సెన్సస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ దిబాకర్‌ బరిహా

కేంద్ర సెన్సస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ దిబాకర్‌ బరిహా

కర్నూలు న్యూసిటీ, మే 21(ఆంధ్రజ్యోతి): నగరంలో కొనసాగుతున్న గృహ గణన(సెన్సస్‌) సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర సెన్సస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ దిబాకర్‌ బరిహా అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా ఇన్‌చార్జి ఎన్‌.దిపక్‌ భరద్వాజ్‌, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ సతీ ష్‌కుమార్‌రెడ్డితో కలిసి సుంకేసుల రోడ్డు, జీపీఆర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఇంటింటి గణన ప్రక్రియను పరిశీలించారు. దిబాకర్‌ బరిహా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల రూపకల్ప నకు ఎంతో కీలకమన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి, కచ్చితమైన సమాచారాన్ని నమో దు చేయాలని సూచించారు. ఎన్‌.దీపక్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ ఫీల్డ్‌ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రతిరోజూ నిర్ధేశిత లక్ష్యాలను చేరుకునేలా చర్యలు తీసుకోవా లన్నారు. ప్రజలు కూడ గృహగణన సిబ్బందికి సరైన సమాచారమందించి సహ కరించాలన్నారు. ఈనెల 30లోపు గృహగణన ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు.

Updated Date - May 21 , 2026 | 10:51 PM