ఎన్యుమషనను త్వరగా పూర్తి చేయండి
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:22 AM
ప్రతి ఓటరు ఎన్యుమరేషన ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్‌ఓ), నగర పాలక కమిషనర్ చల్లా ఓబు లేసు విజ్ఞప్తి చేశారు.
నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): ప్రతి ఓటరు ఎన్యుమరేషన ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్‌ఓ), నగర పాలక కమిషనర్ చల్లా ఓబు లేసు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన 234, 235, 236, 246 పోలింగ్ కేంద్రాల పరిధిలోని పాతబస్తీ, గడ్డ వీధి, నాగులకట్ట, ఈద్గా వీధి తదితర ప్రాంతాల్లో ‘సర్’పై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఏఈఆర్‌ఓలు, సూప ర్‌వైజర్లు, బీఎల్‌ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మైక్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ ‘సర్’పై అవగాహన కల్పించారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్లూ సర్ ప్రక్రియ ఆవశ్యకతను వివరించారు. అలాగే ఈ నెల 11, 12 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనున్న ప్రత్యేక శిబిరాలపై ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎవరికైనా ఎన్యుమరేషన ఫారం అందకపోతే భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఓటరు గుర్తింపు సంఖ్య నమోదు చేయడం ద్వారా సంబంధిత బీఎల్‌ఓ పేరు, ఫోన నెంబరు తెలుసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఏఈఆర్‌ఓ డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, సూపర్ వైజర్లు మంజూర్ బాషా, వాజిద్, మన్సూర్, శానిటరీ ఇనస్పెక్టర్లు రాజు, ఇంతియాజ్ పాల్గొన్నారు.