డ్రోన సిటీ పనులను త్వరగా పూర్తి చేయండి
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:22 AM
డ్రోన సిటీ ఫేజ్-1 పనులను త్వరితగతిన వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.సిరి ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఏ.సిరి
ఓర్వకల్లు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): డ్రోన సిటీ ఫేజ్-1 పనులను త్వరితగతిన వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.సిరి ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. మండలంలోని చింతలపల్లె, కొమరోలు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న డ్రోన సిటి మొదటి దశ పనులను సోమవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ డ్రోన సిటీ ఫేజ్-1 సంబంధించి రోడ్లు, డ్రైన్ల నిర్మాణం నెలాఖరులోపు పూర్తిచేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్లను, సంబంధింత అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓవర్ హెడ్ ట్యాంకు పంపు పనులను నెలన్నరలోపు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఏపీఐఐసీ జడ్‌ఎం మధుసూదన రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి సంజీవరాజు, ఏపీఐఐసీ అధికారి సందీప్, తహసీల్దార్ విద్యాసాగర్, హుశేనాపురం సొసైటీ అధ్యక్షుడు సీఎన సుధాకర్ రెడ్డి, చింతలపల్లె మాజీ సర్పంచ వెంకటరమణ, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.