Share News

గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయండి

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:56 PM

జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఎవై 1.0, 2.0 అర్బన్‌), వివిధ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జేసీ సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులను ఆదేశించారు.

గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయండి
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌

జేసీ సూరజ్‌ ధనుంజయ్‌

నంద్యాల నూనెపల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఎవై 1.0, 2.0 అర్బన్‌), వివిధ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జేసీ సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో వివిధ గృహ నిర్మాణ పథకాల అమలు తీరు, పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రతి పథకం కింద లబ్ధిదారుల వారీగా గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రెండు రోజుల్లోగా నివేదికలు సమర్పించాలన్నారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ శ్రీహరి గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 10:56 PM