Share News

21 లోపు ఏర్పాట్లు పూర్తి చేయండి

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:06 AM

ఈనెల 23న కొలనుభారతిలో జరిగే వసంత పంచమికి 21వ తేదీ సాయంత్రం లోపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆయా శాఖల అధికారులను శ్రీశైలం దేవస్థానం ఈఈ(ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌) నరసింహారెడ్డి ఆదేశించారు.

21 లోపు ఏర్పాట్లు పూర్తి చేయండి
ఏర్పాట్లు పరిశీలిస్తున్న శ్రీశైలం దేవస్థానం అధికారులు

శ్రీశైలం దేవస్థానం ఈఈ నరసింహారెడ్డి

కొత్తపల్లి/ శ్రీశైలం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఈనెల 23న కొలనుభారతిలో జరిగే వసంత పంచమికి 21వ తేదీ సాయంత్రం లోపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆయా శాఖల అధికారులను శ్రీశైలం దేవస్థానం ఈఈ(ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌) నరసింహారెడ్డి ఆదేశించారు. ఆదివారం కొలనుభారతిలో వసంత పంచమి ఏర్పా ట్లకు ఈఈతో కలిసి ఏఈవో ఫణిదర్‌ ప్రసాద్‌, డీఈ సుబ్బారెడ్డితో పాటు ఆయా శాఖల ఏఈలు సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ కొలనుభారతి క్షేత్రాన్ని శ్రీశైలంలో విలీనం చేసిన తర్వాత మొదటి సారిగా శ్రీశైలం దేవ స్థానం ఆధ్వర్యంలో వసంత పంచమికి భక్తులకు మెరుగైన సౌక ర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరణ, అమ్మవారికి ప్రత్యేక పుష్పాలం కరణ, భక్తులకు శుద్ధజలాలు, ఆలయ ప్రాంగణంలో షామియా నాలు, ప్రత్యేక క్యూలైన్లు, అక్షరాభ్యాస కేంద్రం ఏర్పాటు, ఆత్మకూరు, నందికొట్కూరు నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం, శివపురం నుంచి గూడెం వరకు బీటీ రోడ్డుకు మరమ్మతులు, గూడెం నుంచి క్షేత్రం వరకు రహదారి మరమతులు చేపడుతున్నట్లు తెలిపారు. క్షేత్ర పరి సరాల్లో 20 సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు, వాహనాల పా ర్కింగ్‌ చారుఘోష నది శుభ్రం చేయడం, టాయి లెట్లు, మహి ళల కు తాత్కాలిక దుస్తుల మార్పిడి గదులు అందుబాటులో ఉంచు తా మన్నారు. శ్రీశైలం దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రా లు సమర్పిస్తారన్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి వారి ని సహకరించాలని కోరామన్నారు. శ్రీశైల ప్రభ ఎడి టర్‌ అనిల్‌కు మార్‌, ఏఈలు భువన, పరుశురాం, రంగ ప్రసాద్‌, పెద్ద పూజారి విజయకుమార్‌, వేద పండితులు పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:06 AM