‘సర్’ను పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:46 AM
ఓటర్ల సమగ్ర సవరణను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కోరారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జులు, బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు
డోన్ టౌన్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల సమగ్ర సవరణను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కోరారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జులు, బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు.ఇంటింటికి వెళ్లి అర్హులైన ఓటర్ల పేర్లునమోదయ్యేలా చూడాలనానరు. బీఎల్‌లుఉ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనంతరం పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త అర్షద్ తల్లి మృతదేహానికి నివాళులర్పించారు. తిరునాంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి సతీమణి వెంకటలక్ష్మి మృతి చెందడంతో నివాళి అర్పించారు. పాము కాటుకు చికిత్సపొందుతున్న ప్యాపిలి మండలం గుడిపాడు చెందిన వెంకటరెడ్డిని ఆసుపత్రికి వెళ్లి పరామార్శించారు. కోట్రికే ఫణిరాజ్, వలసల రామకృష్ణ, పెద్ద కేశవయ్య గౌడు, సలీంధ్ర శ్రీనివాసులు, టీఈ రాఘవేంద్రగౌడు, శేషషణి గౌడు, రఫీ, భూమా నాగన్న, మిద్దెపల్లి గోవిందు, కొత్తకోట శ్రీను, రంజిత్ కిరణ్, గోవిందరెడ్డి, గోసానిపల్లె శ్రీరాములు, జయన్న యాదవ్, వలసల బాలుడు, కొత్తకోట రామచంద్ర యాదవ్, గూండాల జయరాముడు పాల్గొన్నారు.