ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:40 PM
జగనన్న లేఅవుట్ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ సీఈవో నాసరరెడ్డి అన్నారు.
జడ్పీ సీఈవో నాసరరెడ్డి
ఓర్వకల్లు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జగనన్న లేఅవుట్ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ సీఈవో నాసరరెడ్డి అన్నారు. శనివారం ఓర్వకల్లులోని ఎంపీడీవో కార్యా లయంలో హౌసింగ్, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉగాది పండుగలోపు లబ్ధిదారులందరూ సొంతింట్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. బేస్‌మెంట్ లెవెల్‌లో ప్రూప్ లెవెల్‌లో రావాలని, ఇచ్చిన లక్ష్యాన్ని హౌసింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగ అనుసూయ, డిప్యూటీ ఎంపీడీవో శాంతయ్య, ఏపీఎం లక్ష్మీకాంతరెడ్డి, ఏపీవో మద్దేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.