Share News

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం : కలెక్టర్‌

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:38 PM

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యమని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం : కలెక్టర్‌
మహానందిలో యోగా చేస్తున్న కలెక్టర్‌

మహానందిలో విజయవంతంగా ’యోగాంధ్ర’

మహానంది, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యమని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శుక్రవారం మహానంది క్షేత్రంలో 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు. ఆమె మాట్లాడుతూ యోగాకు జాతీయ స్ధాయిలో గుర్తింపు ఉందన్నారు. పుణ్యక్షేత్రంలో దర్శనం కోసం వచ్చిన భక్తులు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంతో ఓపీకతో యోగాసనాలు చేయించిన యోగా గురువ ులను కలెక్టర్‌ మెచ్చుకొన్నారు. ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి మాట్లా డుతూ మహానంది క్షేత్రంలో యోగాంఽధ్ర కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో జేసీ సూరజ్‌ ధనుంజయ్‌, ఆర్డీవో విశ్వనాధ్‌, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో మహామ్మద్‌దౌలా, జిల్లా దేవదా యశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పాండురంగారెడ్డి, ఏఈవో మధుతో పాటు వివిధ శాఖల అధికారులు, వేలాదిమంది పాల్గొని యోగాసనాలు చేశారు.

Updated Date - Jun 12 , 2026 | 11:38 PM