ఫిర్యాదులు పునరావృతం కావద్దు
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:45 PM
పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు.
ఎస్పీ సునీల్ షెరాన్
పీజీఆర్‌ఎస్‌కు 113 ఫిర్యాదులు
నంద్యాల క్రైం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపిం చడం తో పాటు విచారణ, పరిష్కారంలో అలసత్వం ఏమాత్రం తగదని అధికా రులను ఆయన హెచ్చరించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు ప్రాంతాలకు చెందిన బాధితులు వివిధ సమస్యలపై ఎస్పీకి వినతులు అందజేశారు. ఎస్పీ స్వయంగా ఫిర్యాదిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు 113 ఫిర్యాదులు వచ్చాయి.