Share News

1,85,515 మంది రైతులకు పరిహారం

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:14 AM

గత ఖరీ్‌ఫలో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు పూర్తిగా ఎండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు నష్టపోయారు. ఇటీవల కేంద్ర బృందం కర్నూలు జిల్లాలో కరువు పరిస్థితులను రైతులకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించింది. ఇందులో భాగంగా జిల్లాలో రైతులకు జరిగిన నష్టాన్ని కలెక్టర్‌ డా.ఏ. సిరి ద్వారా వ్యవసాయ శాఖ యంత్రాం గం కేంద్ర బృందానికి నివేదిక అందించింది

1,85,515 మంది రైతులకు పరిహారం

ఖరీఫ్ లో 1,68,495 హెక్టార్లలో పంట నష్టం

ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ అంచనా మేరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.144.64 కోట్లు

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల మేరకు రూ.233.23 కోట్లు

త్వరలోనే రైతులకు ఇస్తామన్న జేడీ వరలక్ష్మి

తీవ్ర వర్షాభావంతో ఎండిపోయిన పత్తి పంట

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గత ఖరీ్‌ఫలో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు పూర్తిగా ఎండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు నష్టపోయారు. ఇటీవల కేంద్ర బృందం కర్నూలు జిల్లాలో కరువు పరిస్థితులను రైతులకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించింది. ఇందులో భాగంగా జిల్లాలో రైతులకు జరిగిన నష్టాన్ని కలెక్టర్‌ డా.ఏ. సిరి ద్వారా వ్యవసాయ శాఖ యంత్రాం గం కేంద్ర బృందానికి నివేదిక అందించింది. పంటల వారీగా రైతులకు జరిగిన నష్టంతో పాటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులకు అందించాల్సిన పరిహారాన్ని పూర్తి వివరాలతో కేంద్ర బృందానికి అందజేశామని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. శుక్రవారం కేంద్ర బృందానికి అందజేసిన వివరాలను విలేకరులకు అందజేశారు. వేరుశనగ పంటకు సంబంధించి 14,289 మంది రైతులకు 14,153.77 హెక్టార్లలో పంట దెబ్బతినిందని కేంద్రం రూ.12.06 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.24.06 కోట్లు పరిహారాన్ని అందించాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా జొన్న 353 మంది రైతులు సాగు చేసిన 306.67 హెక్టార్ల పంట దెబ్బతినిందని, దీనికి సంబంధించి కేంద్రం రూ.29.47 లక్షలు, రాష్ట్రం రూ.26.07 లక్షలు అందించాల్సి ఉందన్నారు. మొక్కజొన్న పంటకు సంబంధించి 5,837 మంది రైతులు 2,856 హెక్టార్లలో సాగు చేశారని, వీరికి కేంద్ర ప్రభుత్వం రూ.2.72 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3.57 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించాల్సి ఉందన్నారు. 99 మంది రైతులు పొద్దుతిరుగుడు పంట నష్టపోయారని, కేంద్రం రూ.8.34 లక్షలు, రాష్ట్రం రూ.9.81 లక్షలు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ రైతులకు అందించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. వరి పంటకు సంబంధించి 1,846 మంది రైతులు నష్టపోయారని, 1,101 హెక్టార్లలో ఈ పంట దెబ్బతిందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం రూ.1.87 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.87 కోట్లు పరిహారాన్ని రైతులకు అందజేయాల్సి ఉందన్నారు. 70,877 మంది కంది రైతులకు 63,413 హెక్టార్లలో నష్టం జరిగిందని, కేంద్రం రూ.53.90 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.63.41 కోట్లు అందించాల్సి ఉందన్నారు. 511 మంది కొర్ర రైతులు 307 హెక్టార్లలో నష్టపోయారని, వీరికి కేంద్రం రూ.26.13 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.26.13 లక్షలు పరిహారాన్ని అందించాలన్నారు. 12 మంది పెసర రైతులకు 5.48 హెక్టార్లలో నష్టం జరిగిందని, వీరికి కేంద్రం రూ.47వేలు, రాష్ట్రం రూ.55వేలు పరిహారం అందించాలన్నారు. అలాగే 3,785 మంది సజ్జ రైతులు 1,760 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, కేంద్రం రూ.1.49 కోట్లు, రాష్ట్రం రూ.1.49 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందించాల్సి ఉందన్నారు. 209 మంది పొగాకు రైతులు 213 హెక్టార్లలో సాగు చేసి నష్టపోయారని, వీరికి కేంద్రం రూ.18.11 కోట్లు, రాష్ట్రం రూ.21.3 కోట్లు అందించనున్నట్లు జేడీ తెలిపారు. 80,400 మంది పత్తి రైతులు 78,030 హెక్టార్లలో పంట నష్టపోయారని, వీరికి కేంద్రం రూ.66.45 కోట్లు, రాష్ట్రం రూ.132 కోట్లు పరిహారం అందించాల్సి ఉందన్నారు. 7,213 మంది ఆముదం రైతులు 6,127 హెక్టార్లలో పంటనష్టపోయారని, వీరికి కేంద్రం రూ.5.20 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5.20 కోట్లు ఇన్‌ఫుట్‌ సబ్సిడీగా అందించాల్సి ఉందన్నారు. జిల్లా మొత్తం మీద మొదటి విడతగా 15 మండలాలు, రెండో విడతగా మరో 6 మండలాలను ప్రభుత్వం కరువు నెలకొన్నట్లు ప్రకటించిందని, మొత్తం 21 మండలాల్లో 1,85,515 మంది రైతులు 1,68,495 హెక్టార్లలో సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వీరికి రూ.144.64 కోట్లు కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూ.233.23 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాల్సి ఉందన్నారు. త్వరలోనే ఈ మొత్తం విడుదలయ్యే అవకాశం ఉందని జేడీ వరలక్ష్మి తెలిపారు.

Updated Date - Nov 24 , 2026 | 12:14 AM