Share News

పట్టణాభివృద్ధిలో కమిషనర్లే కీలకం

ABN , Publish Date - May 29 , 2026 | 11:46 PM

నగరాలు, పట్టణాల అభివృద్ధిలో మున్సిపల్‌ కమిషనర్ల బాధ్యత కీలకమని రాష్ట్ర పురపాలక శాఖ పరిపాలన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌(సీడీఎంఏ) పి. సంపత్‌కుమార్‌ అన్నారు.

పట్టణాభివృద్ధిలో కమిషనర్లే కీలకం
మాట్లాడుతున్న సీడీఎంఏ పి. సంపత్‌కుమార్‌

మున్సిపల్‌ శాఖ సీడీఎంఏ పి. సంపత్‌కుమార్‌

కమిషనర్లకు దిశా నిర్దేశం

కర్నూలు న్యూసిటీ, మే 29(ఆంధ్రజ్యోతి): నగరాలు, పట్టణాల అభివృద్ధిలో మున్సిపల్‌ కమిషనర్ల బాధ్యత కీలకమని రాష్ట్ర పురపాలక శాఖ పరిపాలన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌(సీడీఎంఏ) పి. సంపత్‌కుమార్‌ అన్నారు. శుక్రవా రం ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనం లో జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లతో పాటు డోన్‌ కమిషనర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు గార్గేయపురం, జొహరాపురం డంప్‌ యార్డులో బయోమైనింగ్‌, సీఅండ్‌డీ వేస్ట్‌ మేనేజ్‌మెట్‌ ప్లాంట్‌, కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని కర్నూలు కమిష నర్‌ చల్లా ఓబులేసుతో కలసి పరిశీలించారు. గార్గేయపురం డంప్‌యార్డులో ఘన వ్యర్థాల బయోమై నింగ్‌ జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. 15 ఎకరాల్లో బయో మైనింగ్‌ పూర్తి అయిన వెంటనే చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాలని, మరో 9.5 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. బయో మైనింగ్‌ పనులకు రోజువారీ లక్ష్యాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్లతో జరిగిన సమీక్షలో సీడీఎంఏ సంపత్‌కుమార్‌ మాట్లా డుతూ ప్రతిరోజూ 2 నుంచి 3 గంటలు క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మార్పు కనిపించేలా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలన్నారు. డ్రైనేజీ కాలువలు, పారిశుధ్య సమస్యలు, ప్రజా ఫిర్యాదులపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజాప్రతినిధుల కంటే ముందే సమస్యలు కమిషనర్ల దృష్టిలో ఉండాల న్నారు. ప్రతి రోజు సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించాలన్నారు. ఇంటిం టికి డిజిటల్‌ క్యూ ఆర్‌ కోడ్‌ వ్యవస్థ అమలు చేసి, శాటిలైట్‌ ఆధారంగా ఆస్తుల విస్తీర్ణం, ప్రభుత్వ ప్రైవేటు సేవలకు సమాచారాన్ని అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

కర్నూలు కార్పొరేషన్‌పై సంతృప్తి

పట్టణాల వారీగా సమీక్ష నిర్వహించిన సీడీఎంఏ కర్నూలు కార్పొరేషన్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖచిత్ర సమాచారం, నివేదికలు, ముందస్తు చర్యలు వంటి అంశాలపై కమిషనర్‌ చల్లా ఓబులేసును అభినందించారు. కర్నూలులో పిన్‌పాయింట్‌ ప్రొగ్రామ్‌ అమలు చేస్తున్నామని కమిషనర్‌ వివరించారు. చెత్తవాహనాలకు జీపీఎస్‌ అర్చడం, ప్రాసెసింగ్‌ పాయింట్ల వద్ద పర్యవేక్షణ వంటి అంశాలను వివరించారు. కర్నూలు కార్పొరేషన్‌ను ఇతర మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకోవాలని కితాబునిచ్చారు.

ఆదోనిలో ఇంటింటి చెత్తసేకరణ 27 సచివాలయాల పరిధిలో సక్రమంగా జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్‌కు మెమో ఇస్తామని హెచ్చరించారు. గార్బేజ్‌ ఫ్రీ, పూడికతీత పనులు సమర్దవంతంగా జరగడం లేదన్నారు. ఆదోని పట్టణ పారిశుధ్యం అధ్వానంగా ఉందని, కమిషనర్‌ నయీం, ఎంహెచ్‌ఓ సందీప్‌పై అసహనం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైన చోట్ల డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

గూడూరులో పారిశుధ్యం వెనుకబడిందని, మరింత మెరుగ్గా పని చేయాలని సూచించారు. డోర్‌ టూ డోర్‌ కలెక్షన్‌ సక్రమంగా జరగడం లేదని పేర్కొన్నారు. దీనిపై అధికారుల నుంచి పొంతనలేని సమాధానాలు రావడంతో అసహనం వ్యక్తం చేశారు.

డోన్‌ మున్సిపల్‌ కమిషనర్‌పై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాలను సందర్శించాలని సూచించారు. మున్సిపాలిటీ కూడా పారిశుధ్యంలో బాగా వెనుకబడిందని కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అనంతపురం ఆర్‌డీఎంఏ నాగరాజు, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, ఎమ్మిగనూరు కమిషనర్‌ గంగిరెడ్డి, ఆదోని కమీషనర్‌ నయీం, గూడూరు కమిషనర్‌ ఏ.వి.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 11:46 PM