Share News

అన్న క్యాంటీన్‌ నిర్వాహకులపై కమిషనర్‌ ఆగ్రహం

ABN , Publish Date - May 07 , 2026 | 11:03 PM

నగరంలోని వై.జంక్షన్‌ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ నిర్వాహకులపై నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్న క్యాంటీన్‌ నిర్వాహకులపై కమిషనర్‌ ఆగ్రహం
ప్రజలతో మాట్లాడుతున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

సూపర్‌వైజర్‌ తొలగింపునకు ఆదేశం

కర్నూలు న్యూసిటీ, మే 7(ఆంధ్రజ్యోతి): నగరంలోని వై.జంక్షన్‌ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ నిర్వాహకులపై నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన క్యాంటీన్‌ను తనిఖీచేశారు. గతంలో తనిఖీ చేసిన సమ యంలో, ప్రస్తుతం సైతం టోకెన్ల కౌంటర్‌ వద్ద నిర్వాహకులు అందుబాటులో లేక పోవడంపై కమిషనర్‌ ఆగ్రహించారు. అన్న క్యాంటీన్ల సిటీ సూపర్‌ వైజర్‌కు ఫోన్‌ చేసి సం బంధిత నిర్వాహకుడిని మార్చాలని ఆదేశించారు. కమిషనర్‌ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నా రని నిర్వా హకులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. టోకెన్ల పంపిణీ, భోజన వడ్డనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, క్యాంటీన్‌ పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు.

Updated Date - May 07 , 2026 | 11:03 PM