Share News

కానాల చెరువును సందర్శించిన కలెక్టర్‌

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:21 PM

నంద్యాల మండలంలోని కానాల చెరువును కలెక్టర్‌ రాజకుమారి గురువారం పరిశీలించారు.

కానాల చెరువును సందర్శించిన కలెక్టర్‌
కానాల చెరువు పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

నంద్యాల రూరల్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల మండలంలోని కానాల చెరువును కలెక్టర్‌ రాజకుమారి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుకు సంబంధించిన నాల్గవ స్లూయిస్‌ ప్రాంతాన్ని సందర్శించి, కేసీ కెనాల్‌ కార్యనిర్వాహక ఇంజనీర్‌ నుంచి సంబంధిత సాంకేతిక, పరిపాలనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కానాల చెరువు కింద మొత్తం మూడు స్లూయి్‌సలు ఉండగా, ఈ చెరువు ద్వారా సుమారు 800 ఎకరాల ఆయకట్టు సాగునీటి లబ్ధి పొందుతోందని ఈఈ ప్రతాప్‌ కలెక్టర్‌కు వివరించారు. గతంలో అనధికారికంగా నిర్మించబడిన నాల్గవ స్లూయిస్‌ను 2019లో న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మూసివేసినట్లు తెలిపారు. దీన్ని పునరుద్ధరణకు సంబంధించి రైతుల నుంచి వినతులు అందిన నేపథ్యంలో, ఈ అం శం పూర్తిగా న్యాయస్థాన పరిధిలో ఉన్నదని పేర్కొంటూకలెక్టర్‌ పరిశీలన నిర్వహించి ప్రస్తుత పరిస్థితులు, సాధ్యాసాధ్యాలపై సంబంధిత శాఖాధికారుల నుంచి నివేదికలు కోరారు. న్యాయస్థానం ఉత్తర్వులకు లోబడి తదుపరి చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Updated Date - Jan 22 , 2026 | 11:21 PM