పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:13 AM
పత్తికొండ మండలం కనకదిన్నె, దూదేకొండ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ డా. సిరి పరిశీలించారు. పోలింగ్ సరళిని పరిశీలించి ఓటింగ్ రికార్డులను పరిశీలించారు.
పత్తికొండ, నవంబరు5, (ఆంధ్రజ్యోతి): పత్తికొండ మండలం కనకదిన్నె, దూదేకొండ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ డా. సిరి పరిశీలించారు. పోలింగ్ సరళిని పరిశీలించి ఓటింగ్ రికార్డులను పరిశీలించారు. ఎన్నికల నియమావళిని అనుసరించి పోలింగ్ జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా పోలింగ్ పూర్తి చేయాలని ఆర్‌వో శివరుద్రకుమార్‌కు, ఏఆర్వో కవితకు సూచించారు. అలాగే పత్తికొండ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు. డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూంలో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే అంశంపై అధికారులతో మాట్లాడారు.