Share News

నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:40 AM

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ నామినేషన్‌ కేం ద్రాన్ని శుక్రవారం కలెక్టర్‌ ఏ.సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌
నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఏ.సిరి

కోడుమూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ నామినేషన్‌ కేం ద్రాన్ని శుక్రవారం కలెక్టర్‌ ఏ.సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామి నేషన్ల స్వీకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. నామినేషన్‌ పత్రాల స్వీకరణ భద్రపరిచే విధానం, సీసీ కెమెరాల పనితీరు, పోలీ సుల బందోబస్తు తదితర అంశాలను రిటర్నింగ్‌ అధికారి జయంతి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఏసీ రాముడును అడిగి తెలుసుకు న్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల పాటిస్తూ అభ్య ర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నామినేషన్లను స్వీకరిం చాలన్నారు. అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో ఏవైన లోపాలు ఉంటే కూడా అభ్యర్థుల చేత పూర్తి చేయించి నామినేషన్లు తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారులకు సూచిచామన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:40 AM