Share News

ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్‌ తనిఖీలు

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:16 PM

మహానంది సమీపంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్‌ రాజకుమారి మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్‌ తనిఖీలు
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌

మరుగుదొడ్ల అపరిశుభ్రతపై ఆగ్రహం

మహానంది, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మహానంది సమీపంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్‌ రాజకుమారి మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్ధుల సమస్యలపై నేరుగా మాట్లాడారు. ఇటీవల నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల పరిసరాల్లో ఆటలాడుకుంటే ప్రమాదవశాత్తు కింద పడి గాయాలపాలై విద్యార్థి విజయ్‌కుమార్‌ మృతి చెందడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్ధుల మరుగుదొడ్లు అపరి శుభ్రంగా ఉండటం, కొన్నింటికి నీరు రాకపోవడం స్యయంగా కలెక్టర్‌ పరిశీలించి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. భోజనశాలతో పాటు సరుకులు నిల్వ ఉండే గదులను తనిఖీ చేసారు. నాణ్యత గల ఆహారం విద్యార్ధులకు అందించాలని ఆదేశించారు. విద్యార్ధి మృతిపై తీసుకున్న చర్యల్లో భాగంగా.. సెలవులో ఉన్న తనను కూడా సస్పెండ్‌ చేసారని ఉపాధ్యాయిని నాగమ్మ కలెక్టర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు హరికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 11:16 PM