సెక్యూరిటీ సిబ్బందిపై కలెక్టర్ ఆరా
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:16 PM
నంద్యాల పట్టణంలోని జీజీహెచ్‌లో సెక్యూరిటీ సిబ్బంది గురించి కలెక్టర్ రాజకుమారి గురువారం ఆరా తీశారు.
నంద్యాల జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీ
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
నంద్యాల హాస్పిటల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల పట్టణంలోని జీజీహెచ్‌లో సెక్యూరిటీ సిబ్బంది గురించి కలెక్టర్ రాజకుమారి గురువారం ఆరా తీశారు. ఈగల్ హంటర్ కాంట్రాక్టర్ సిబ్బందిని తక్కువగా ఉంచి ప్రభుత్వం నుంచి డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నట్లు ఆంధ్రజ్యోతి ‘49 మందికి 67 బిల్లులు’ అనే శీర్షికతో మార్చి 28న కథనం ప్రచురించింది. దీనిపై కలెక్టర్ జీజీహెచ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జిలానీని సెక్యూరిటీ ఎంత మంది ఉన్నారు? ఎంతమంది ఉండాలి? అని అడిగి తెలుసుకున్నారు. ఎంఓయూ ప్రకారం 67 మంది ఉండాలని, 49 మంది హాజరవుతున్నారని కలెక్టర్‌కు సూపరింటెండెంట్ వివరించారు. సిబ్బంది ఉన్నారో అంతమందికే బిల్లులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.