Share News

ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:13 PM

జిల్లా పరిషత్‌ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ ఏ.సిరి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ పరిపాలన భవనంలోని చైర్మన్‌ చాంబర్‌లో జడ్పీ సీఈవో ఆర్‌.సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా సంతకం చేశారు.

ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ
జడ్పీ ప్రత్యేకాధికారి ఏ.సిరికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఈవో సుధాకర్‌రెడ్డి

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ ఏ.సిరి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ పరిపాలన భవనంలోని చైర్మన్‌ చాంబర్‌లో జడ్పీ సీఈవో ఆర్‌.సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా సంతకం చేశారు. సీఈవో కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరి ష్కార మార్గాల గురించి సీఈవోను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిషత్‌ పరిధిలో జడ్పీ వస్తున్న నిధులపై ఆమె ఆరాతీశారు. కార్యక్రమంలో పరిపాలన అధికారులు సి.మురళీ మోహన్‌రెడ్డి, సరస్వతమ్మ, జితేంద్ర, బసవశేఖర్‌, సిబ్బంది కిరణ్‌కుమార్‌, తిరుమలేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 11:13 PM