Share News

నంద్యాల మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:50 PM

నంద్యాల మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ రాజకుమారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

నంద్యాల మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌
కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న మున్సిపల్‌ అధికారులు

నంద్యాల టౌన్‌/ నూనెపల్లి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): నంద్యాల మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ రాజకుమారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న కలెక్టర్‌ చాంబర్‌లో ఆమె ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అం దించాలన్నారు. పారి శుధ్యం, మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు. జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. ప్రజాసమస్యలను సమయాను కూలంగా పరిష్కరించాలని సూచించారు. ఏంఈ గురప్ప యాదవ్‌, పట్టణ ప్రణాళిక అధికారి నరసింహమూర్తి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 11:50 PM