అంగనవాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:33 AM
నగరంలోని 19వ వార్డు గణేష్ నగర్‌లోని అంగనవాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఏ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు తనిఖీ చేశారు.
కల్లూరు, జూన 20(ఆంధ్రజ్యోతి): నగరంలోని 19వ వార్డు గణేష్ నగర్‌లోని అంగనవాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఏ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు తనిఖీ చేశారు. అంగనవాడీ కేంద్రంలో ఆహార నాణ్యత, పరి శుభ్రత, స్టాక్ రిజిస్టర్ ఎంట్రీలను పరిశీలించారు. చిన్నారులకు అంది స్తున్న ఆహారం, పరిశుభ్రత పరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. అంగనవాడీ సిబ్బంది పిల్లల తల్లిదండ్రు లతో వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆదేశిం చారు. అంగనవాడీ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు, శుభ్రమైన శౌచాలయం, స్వచ్ఛమైన తాగునీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాతా శిశు సంక్షేమశాఖ అధికారులు తరచూ ప్రతి అంగనవాడీ కేంద్రాన్ని సందర్శించాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు ప్రభు త్వం అందిస్తున్న పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.విజయ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.