Share News

నగరాభివృద్ధికి సమష్టి కృషిచేయాలి

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:57 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ కర్నూలు నగరాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

నగరాభివృద్ధికి సమష్టి కృషిచేయాలి
కార్పొరేటర్లతో మంత్రి టీజీ భరత్‌

ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలి

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ కర్నూలు నగరాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆదివారం తన నివాసంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి మా ట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంగా అప్పగించిన బాధ్యతలను గుర్తించి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో కర్నూలు నగర మేయర్‌ బోల్లెద్దుల విజయ ప్రత్యూష, నూతన కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 12:57 AM