Share News

స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు సహకరించాలి

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:09 AM

స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. శనివారం పట్టణంలో చెత్తా చెదారం సేకరించే ఈ ఆటోలను ప్రారంభించారు.

స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు సహకరించాలి
ఎగ్గొనిలో సీసీ రోడ్డు ప్రారంభిస్తున్న మంత్రి బీసీ

మంత్రి బీసీ.. నియోజకర్గంలో పర్యటన

బనగానపల్లె, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. శనివారం పట్టణంలో చెత్తా చెదారం సేకరించే ఈ ఆటోలను ప్రారంభించారు. నియోజకవర్గాన్ని పరిశుభ్రత, పచ్చదనంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు సూచన మేరకు ప్రజా భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఎంపీడీవో మురళీమోహన్‌ పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలి

అవుకు: పరిసరాల పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలని మంత్రి బీసీ పేర్కొన్నారు. శనివారం మార్కెట్‌ వీధిలోని చెత్త కుప్పలను శుభ్రం చేసి, ర్యాలీ నిర్వహించారు. బస్టాం డు సర్కిల్‌లో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్‌రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, బనగానపల్లె ఏఎంసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు మారం పుల్లారెడ్డి, ఎస్‌ రామకృష్ణారెడ్డి, మొట్ల రామిరెడ్డి, వంగల పరమేశ్వరరెడ్డి, బత్తిని మద్దిలేటి, వెంకటరమణనాయక్‌, దంతెలరమణ, అరుణ్‌కుమార్‌ నాయక్‌, ఆర్డీవో నరేంద్రనాథ్‌రెడ్డి, తహసీల్దార్‌ ఫకీర్‌అహ్మద్‌, ఎంపీడీవో రామకృష్ణవేణి, ఎంఈవోలు శ్రీధర్‌రావు, వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్లు యమున, నవీన్‌, ఈవో విజయకుమారి, పీడీవోలు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

శింగనపల్లె పంచాయతీ మజరా గ్రామం ఓబుళాపురంను అభివృద్ది చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. శనివారం పార్టీ నాయకుడు సాంబశివారెడ్డితో కలసి గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. రిజర్వాయర్‌ నుంచి కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల, అవుకు మండలాలకు తాగునీరందించేందుకు రూ.57లక్షలతో ఏర్పాటు చేస్తున్న పైపులైన్‌ పనులను పరిశీలించారు.

అభివృద్ధి చేస్తున్నాం.. ఆశీర్వదించండి

సంజామల: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం స్థానిక సంస్ధల ఎన్నికల్లో ఆశీర్వదించాలని మంత్రి కోరారు. శనివారం సాయంత్రం ఎగ్గోని గ్రామంలో రూ.60లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్‌, రూ.4లక్షలతో నిర్మించిన పైపులైన్‌ను ప్రారంభించారు. అభివృద్ధిని ఓర్వలేకనే వైసీపీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు సూపర్‌సిక్స్‌ను సక్సెస్‌ చేశారని, పింఛన్‌ను రూ.4వేలు పెంచామని, త్వరలో కొత్తవారికి కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. మద్దిలేటి రెడ్డి, శంకర్‌ రెడ్డి, బత్తుల ప్రతాప్‌ రెడ్డి, కానాల కేశవ రెడ్డి, మోహన్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, పరమేశ్వర్‌ రెడ్డి, మూసాని చంద్రశేఖర్‌ రెడ్డి, బత్తుల ప్రతాప్‌ రెడ్డి, చిన్నబాబు, రమణారెడ్డి, తిమ్మ య్య, మల్కి హుస్సేన్‌, మద్దిలేటి, మాధవ, విష్ణువర్ధన్‌ రెడ్డి, సుధాకర్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:09 AM