Share News

ఎస్‌ఐఆర్‌కు సహకరించాలి

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:18 AM

ప్రత్యేక సమగ్ర సవరణను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకరించాలని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ కోరారు.

ఎస్‌ఐఆర్‌కు సహకరించాలి
మాట్లాడుతున్న కర్నూలు ఆర్‌వో విశ్వనాథ్‌

రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరిన ఆర్‌వో, కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర సవరణను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకరించాలని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ కోరారు. మంగళవారం కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈసీ మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి సవరించే ప్రత్యేక ప్రక్రియ అని వివరించారు. మరణించిన వారు, డూప్లికేట్‌ పేర్లు తొఒలగించడం, చిరునామా మారిన ఓటర్ల వివరాలు సరిచేయడం, నూతన ఓటర్లను జాబితాలో చేర్చడం, ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బూత్‌స్థాయి అధికారుల ఓటీపీలు అడగరని, గుర్తింపు కార్డులతోనే ఇంటింటికి వచ్చి ధృవీకరణ చేపడతారని స్పష్టం చేశారు. అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవి.కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీ్‌షకుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ రవికుమార్‌, డిప్యూటి తహశీల్దారు ధనుంజయ, ఎస్‌ఈ రమణమూర్తి, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 12:18 AM