క్రీడాభివృద్ధికి సహకరించాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:23 AM
నగరంలో క్రీడల అభివృద్దికి రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ కోరారు. సోమవారం అవుట్‌డోర్ స్డేడియంలో ఉమ్మడి జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్
కర్నూలు స్పోర్ట్స్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): నగరంలో క్రీడల అభివృద్దికి రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ కోరారు. సోమవారం అవుట్‌డోర్ స్డేడియంలో ఉమ్మడి జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించారు. తాను మొదటి నుంచి క్రీడల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామనన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం, ఏపీ ఎస్పీబెటాలియన్‌లో మరో స్టేడియాన్ని సొంత నిధులతో, అవుట్ డోర్ స్టేడియంలో, మరో ఇండోర్ స్టేడియంను ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు తెలిపారు. అలాగే పంచలింగాల గ్రామంలో మరో స్టేడియంను నిర్మించేందుకు తలపెట్టినప్పుడు కొందరు రాజకీయంగా అడ్డుకున్నారని, వాటిని అధిగమించి అక్కడ కూడా స్టేడియం ఏర్పాటు చేసినట్లు టీజీ వెంకటేశ్ తెలిపారు. ప్రస్తుతం జోహరాపురం ప్రాంతంలో ఉన్న పాత డంప్ యార్డులో ఫుట్‌బాల్ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని, ఎంతోమంది అడ్డు తగులుతున్నారని టీజీ వివరించారు. డీఎ్‌సడీవో భూపతిరావు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భార్గవ్, దాశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు.