Share News

సీఎం పర్యటన కేంద్రాల సందర్శన

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:53 PM

ఈనెల 25న సంజీవని ప్రాజెక్ట్‌ ప్రోగ్రామ్‌ను సీఎం చంద్రబాబునాయుడు మండలకేంద్రమైన ఆస్పరి పీహెచ్‌సీలో ప్రారంభిస్తుండంతో గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఆయా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

సీఎం పర్యటన కేంద్రాల సందర్శన
ఆస్పరిలో ఆసుపత్రి ఆవరణలో పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిరి

ఆస్పరి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఈనెల 25న సంజీవని ప్రాజెక్ట్‌ ప్రోగ్రామ్‌ను సీఎం చంద్రబాబునాయుడు మండలకేంద్రమైన ఆస్పరి పీహెచ్‌సీలో ప్రారంభిస్తుండంతో గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఆయా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం హెలిప్యాడ్‌, ప్రజావేదిక, కార్యకర్తల సమావేశ ఆవరణ, సంజీవని ప్రారంభోత్సవ ఏరియాలను, సీఎం వెళ్తున్న మార్గాలను ఆమె నిశితంగా పరిశీలించారు. ఏయే చోట్ల ఏమి అవస రమయో తెలుసుకున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు మూడు గంటల సమయం కేటాయించి ప్రాజెక్టు లాంచింగ్‌ను తెలుసు కున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంజీవని ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని ప్రాజెక్టును ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని కోరారు. స్థానిక వైద్యులను అడిగి ఆయా అంశాలను తెలుసు కున్నారు. ముఖ్యమంత్రి అడిగిన ప్రతి అంశంపై అవగాహన ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్‌, డీఎస్పీ వెంకటరామయ్య, సీఐ శ్రీనివాస్‌నాయక్‌, ఎంపీడీఓ గీతావాణి, వైద్యాధికారి రఘురామ్‌రెడ్డి, బాలకృష్ణ, దుర్గాభాయి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 11:53 PM